ఆక్స్‌ఫర్డ్ 2024 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా Brain Rotను ఎంపిక చేసింది. ఇటీవల 37 వేల మందితో ఓ పోల్ ఏర్పాటు చేసి ఈ పదాన్ని ఎంపిక చేసింది. బ్రెయిన్ రాట్ అంటే.. మానసిక లేదా మేధో స్థితి క్షీణించడం అని అర్థం. అవసరం లేని కంటెంట్‌ను అధికంగా వినియోగించడం వల్ల సాధారణంగా ఇది జరుగుతుంది. ఆంగ్ల రచయిత హెన్రీ డేవిడ్ 1854లో తాను రాసిన ‘వాల్డెన్’ అనే పుస్తకంలో ఈ పదాన్ని వాడారు.