సిరియాలోని మిలిటెంట్ల స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా వైమానిక దాడులకు తెగబడింది. ఈ దాడుల్లో 38 మంది మిలిటెంట్లు హతమైనట్లు వెల్లడించింది. వీరికి అంతర్జాతీయ ఉగ్ర సంస్థ అల్ ఖైదాతో సంబంధమున్నట్లు పేర్కొంది. మృతుల్లో ఇద్దరు కీలక నేతలు కూడా ఉన్నట్లు అమెరికా ప్రకటించింది.