నాసా ఆర్థిక సాయంతో నిర్వహిస్తున్న అట్లాస్ సాయంతో ఆగస్టు 7న 2024 పీటీ5ను గుర్తించారు. గత గమనాలను బట్టి చూస్తే ఇది ఏదో ఒక అంతరిక్ష వస్తువు ఢీకొన్నప్పుడు చంద్రుడి నుంచి విడివడిన ముక్కలా కనిపిస్తోందని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబోరేటరీకి చెందిన నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ స్టడీస్ డైరెక్టర్ పాల్ చోడస్ అంటున్నారు. అంటే కొత్త మినీ మూన్ మన చంద్రుడిలో చిన్న భాగమన్నమాట. ఇది భూమి చుట్టూ ఒకసారైనా ప్రదక్షిణ చేయడం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.