ఏపీ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటనకు సిద్దమైంది. అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానించనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. జనాభా ప్రాతిపదికన వైన్‌షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పదివేలు జనాభా ఉన్న చోట రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలు ఉన్న చోట రూ.55లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలు జనాభా వరకు రూ.65 లక్షలు, 5 లక్షలకుపైన ఉన్నచోట రూ.85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణ యించారు.