తీవ్ర రక్తస్రావాన్ని సెకన్లలో ఆపే జెల్‌కు ఆమోదం తెలిపిన అమెరికా

79చూసినవారు
తీవ్ర రక్తస్రావాన్ని సెకన్లలో ఆపే జెల్‌కు ఆమోదం తెలిపిన అమెరికా
చిన్నపాటి నుంచి తీవ్ర రక్తస్రావాన్ని సెకన్లలో అదుపు చేసే జెల్ వినియోగానికి అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. బ్రూక్లిన్ ప్రాంతంలోని బయోటెక్నాలజీ కంపెనీ క్రెసిలాన్స్ 'ట్రామాజెల్' పేరుతో దీనిని తయారుచేసింది. ఆల్గే (నాచు) నుంచి ఉత్పత్తి చేసిన ఈ జెల్ ప్రాణాంతక రక్తస్రావాన్ని కూడా ఆపగలదు. సిరంజిలో నింపి ఉండే ఈ జెల్ గాయంపై ఒత్తిడి లేకుండానే రక్తం గడ్డకట్టేలా చేస్తుంది.

సంబంధిత పోస్ట్