ఐఏఎస్‌ల వ్యవహారంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. డీఓపీటీ ఆదేశాలపై క్యాట్‌కు వెళ్లినా అధికారులకు రిలీఫ్ దక్కలేదు. దీంతో.. ఏపీ ప్రభుత్వం ముందు రిపోర్ట్ చేయటానికి అమ్రపాలీ సహా ఇతర అధికారులు సిద్దమయ్యారు. ఏపీలో అమ్రపాలీకి కీలక బాధ్యతలు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రధాని కార్యాలయంలో పని చేసి ఉండటం ఇప్పుడు ఆమ్రపాలికి కలిసొచ్చే అంశం.