ఒకే రోజులో 15 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన అమెరికన్

83చూసినవారు
ఒకే రోజులో 15 గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ బద్దలుకొట్టిన అమెరికన్
అమెరికాకు చెందిన డేవిడ్ రష్ 250కి పైగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (GWR) బద్దలు కొట్టారు. అతను ఒకే రోజులో మరో 15 రికార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. ఆయనను 'సీరియల్ రికార్డ్ బ్రేకర్'గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అభివర్ణించింది. డేవిడ్ ఒక నిమిషంలో 3 యాపిల్స్ ను గాలిలోకి ఎగిరేస్తూ వాటిని అత్యధిక సార్లు కొరికిన వ్యక్తిగా నిలిచారు. ఒక నిమిషంలో 3 బంతులను అత్యధిక సార్లు ఎగరేసిన వ్యక్తిగా కూడా సంచలన రికార్డు సృష్టించారు.

సంబంధిత పోస్ట్