యువకుడి ఛాతిలో దిగిన బాణం

55చూసినవారు
యువకుడి ఛాతిలో దిగిన బాణం
ఛాతిలో బాణం గుచ్చుకొని ప్రాణాల కోసం పోరాడుతున్న గిరిజన యువకుడిని నిమ్స్ వైద్యులు కాపాడారు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా ఊనూర్‌కు చెందిన సోది నంద (17) అడవిలోకి వెళ్లగా ప్రమాదవశాత్తూ ఛాతిలో బాణం దిగింది. వెంటనే భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేసి విజయవంతంగా బాణం తొలగించారు.

సంబంధిత పోస్ట్