పిన్నెల్లిపై మరో కేసు నమోదు

19653చూసినవారు
పిన్నెల్లిపై మరో కేసు నమోదు
మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మరో కేసు నమోదైంది. పల్నాడు జిల్లా కారంపూడి సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో పిన్నెల్లిని నిందితుడిగా పోలీసులు చేర్చారు. సీఐ వాంగూల్మం మేరకు పోలీసులు ఆయనపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశారు. కాగా, ఈ నెల 13న జరిగిన పోలింగ్ తర్వాత సీఐ నారాయణ స్వామిపై వైసీపీ మూకలు రాళ్లతో దాడి చేశాయి. ఈ దాడికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, సోదరుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వం వహించినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్