ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెంచరీ మిస్ అయినందుకు తనకు బాధగా లేదని శ్రేయాస్ అయ్యర్ పేర్కొన్నారు. ఆ మ్యాచ్‌లో టీమిండియా 44 పరుగుల తేడాతో విజయం సాధించడం ఆయనకు సంతృప్తిని ఇచ్చిందన్నారు. "దేశవాళీ క్రికెట్‌లో చాలా కఠిన బంతులకు సిక్సర్లు కొట్టా. అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. నేను ఎవరికీ ఎలాంటి సందేశం పంపాల్సిన అవసరం లేదు." అని శ్రేయాస్ అన్నారు.