దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు చాలా రోజుల తర్వాత భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ ఉదయం లాభాల్లో ట్రేడ్ అయిన సూచీలు సాయంత్రం వరకు అదే జోరును కొనసాగించాయి. నిఫ్టీ 325 పాయింట్లు లాభపడి 22,834 వద్ద ముగియగా సెన్సెక్స్ 1134 పాయింట్లు లాభాపడి 75,301 వద్ద స్థిరపడింది. డాలర్ తో పోలీస్తే రూపాయి మారకం విలువ 86.81గా ఉంది.