మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో అందాల బామ్మ

75చూసినవారు
మిస్ టెక్సాస్ యూఎస్ఏ పోటీలో అందాల బామ్మ
అమెరికాలో జరిగిన మిస్‌ టెక్సాస్‌ యూఎస్‌ఏ పోటీలో యువతులతోపాటు 71 ఏండ్ల మరిస్సా టీజో అనే బామ్మ కూడా పాల్గొని రికార్డు సృష్టించారు. హ్యూస్టన్‌లో నిర్వహించిన ఈ పోటీల్లో 75 మంది పాల్గొన్నారు. ఈ పోటీలో అరియెన్నా విజేతగా నిలిచి అందాల సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. లేటు వయసులో అందాల పోటీలో పాల్గొనడంపై టీజో మాట్లాడుతూ.. ఇలాంటి అందాల పోటీల్లో భాగస్వామినవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్