BJPకి మద్దతిచ్చిందని భార్యకు 'ట్రిపుల్ తలాక్'

70చూసినవారు
BJPకి మద్దతిచ్చిందని భార్యకు 'ట్రిపుల్ తలాక్'
మధ్యప్రదేశ్‌ చింద్వారా జిల్లాలో తాజాగా షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. బీజేపీకి మద్దతు ఇచ్చినందుకు కోపంతో తన భర్త తనకు 'ట్రిపుల్ తలాక్' చెప్పాడని 26 ఏళ్ల మహిళ వాపోయింది. తమకు 8 ఏళ్ల క్రితం పెళ్లైందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. తనను ఏడాదిన్నర క్రితం ఇంటి నుంచి గెంటేశారని పేర్కొంది. భర్త వాదన మరోలా ఉంది. ఆమెకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె భర్త ఆరోపించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్