తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవికి అన్నామలై శుక్రవారం రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటామని ఆయన వెల్లడించారని సమాచారం. తాను మరోసారి అధ్యక్ష పదవి రేసులో లేనని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడు బీజేపీలో ఎంతోమంది సమర్థవంతమైన నేతలు ఉన్నారని ఆయన అన్నారు. త్వరలో వారి నుంచే కొత్త నాయకుడిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని అన్నామలై పేర్కొన్నారు.