సెల్‌లో నన్ను ఒంటరిగా ఉంచద్దు: వల్లభనేని వంశీ

82చూసినవారు
సెల్‌లో నన్ను ఒంటరిగా ఉంచద్దు: వల్లభనేని వంశీ
తనకు ఆస్తమా సమస్య ఉందని జైలులోని సెల్‌లో తనను ఒంటరిగా ఉంచవద్దని వల్లభనేని వంశీ విజయవాడ కోర్టులో జడ్జిని కోరారు. ఆరోగ్య సమస్య వస్తే ఇబ్బందని.. తనతో పాటు సెల్‌లో మరొకరిని ఉంచాలని గురువారం ఆయన కోర్టును కోరారు. సెల్‌లో మరొకరిని ఉంచేందుకు తాను ఆదేశించలేనని జడ్జి తెలిపారు. ఆరోగ్య పరిశీలనకు వార్డెన్‌ను ఏర్పాటు చేసేందుకు అభ్యంతరం లేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. అనంతరం వంశీని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్