మామిడి పూతపై కాయల దిగుబడి ఆధారపడి ఉంటుంది. ఇందుకు మోనోక్రోటోపాస్ 1.6 మిల్లీలీటర్ల మందు, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. కాయ దశలో నల్లని మచ్చలు వచ్చేందుకు కారణమయ్యే తామర పురుగు రసం పీల్చే పురుగుల నివారణకు లామ్డా సైహాలోత్రిన్ లేదా కాన్సిడార్, లేదా ఫిఫ్రోనిల్ అనే మందులలో ఒక దానిని పిచికారీ చేయాలి. కాయదశలో నీటితడులు మంచి దిగుబడినిస్తాయి.