ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్) -2024 సీజన్ విజేతగా హరియాణా స్టీలర్స్ జట్టు నిలిచింది. పుణేలోని శ్రీ శివ్ ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు 32-23తో పట్నా పైరేట్స్‌పై గెలిచి తొలిసారిగా పీకేఎల్ విజేతగా నిలిచింది. . గత సీజన్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న హరియాణా.. ఈ సీజన్లో విజేతగా నిలవడం విశేషం.