ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1

76చూసినవారు
ఇస్రో మరో చరిత్ర.. హాలో కక్ష్యను పూర్తి చేసిన ఆదిత్య-ఎల్1
ఇండియాకు చెందిన సూర్యన్ ఆదిత్య-ఎల్1 అంతరిక్షంలో మరో చరిత్ర సృష్టించింది. 2024 జనవరి 6న అంతరిక్షంలోకి ప్రవేశించిన ఆదిత్య ఎల్-1 తన మొదటి హాలో ఆర్బిట్‌ను పూర్తి చేసింది. 178 రోజుల్లో ఒక రౌండ్ పూర్తయిందని మంగళవారం ఇస్రో ట్వీట్ చేసింది. ఆదిత్య-L1 మిషన్.. సూర్యుడిని అధ్యయనం చేయడానికి రూపొందించారు. ఈ అంతరిక్ష నౌకను ఇస్రో రూపొందించి అభివృద్ధి చేసింది. ఇది భూమికి 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ పరిభ్రమిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్