కెనడాలో మరో భారతీయుడి అరెస్టు

79చూసినవారు
కెనడాలో మరో భారతీయుడి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య కేసులో కెనడా అధికారులు మరో భారత పౌరుడిని అరెస్టు చేశారు. సర్రే నివాసి అమన్‌దీప్‌ సింగ్‌ (22)ను అదుపులోకి తీసుకున్నట్లు విచారణాధికారులు తెలిపారు. నిజ్జర్‌పై కాల్పుల జరిపిన ఇద్దరు వ్యక్తుల్లో అమన్‌ ఒకరని అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఈ నెల 3న ముగ్గురు భారతీయులు అరెస్టయిన సంగతి తెలిసిందే.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్