గురుకులాల్లో ప్రవేశాలకు మరో అవకాశం

60చూసినవారు
గురుకులాల్లో ప్రవేశాలకు మరో అవకాశం
TG: ఎస్సీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు మరోసారి అవకాశం ఇస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. 5 నుంచి 9వ తరగతి వరకు మిగిలిన సీట్లలో ప్రవేశాలకు జులై 12 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్ష ద్వారా ఎస్సీ గురుకులాల్లో సీట్ల భర్తీ చేయనున్నట్లు వివరించారు. గురుకులాల్లో పేద విద్యార్థులకు ఉచితంగా నాణ్యమైన విద్య అందుతోందని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :