నార్వేలోని టోర్ప్ ఎయిర్ పోర్టులో రాయల్ డచ్‌కు చెందిన విమానం రన్‌వేపై అదుపు తప్పింది. ఓస్లో ఎయిర్ పోర్టులో టేకాఫ్ తీసుకొన్న వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటుచేసుకొంది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోని టోర్ప్ ఎయిర్ పోర్టుకు దీనిని మళ్లించారు. ఇది సురక్షితంగా నేలపైకి దిగినా రన్‌వేపై మాత్రం అదుపుతప్పింది. ఇది సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు.