ఐపీఎల్ 2025 భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 6వ ఓవర్‌లో రషీద్ ఖాన్ తన అద్భుత స్పెల్‌తో పంజాబ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య వికెట్ తీశారు. దీంతో రషీద్ ఖాన్ తన ఐపీఎల్ కెరీర్‌లో 150 వికెట్లను పూర్తి చేసుకున్నారు. రషీద్ ఖాన్ఈ వికెట్ తీసి ప్రియాంష్ ఆర్య- శ్రేయాస్ 51 (21) పరుగుల భాగస్వామ్యానికి అడ్డుకట్ట వేశారు.