టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ స్టార్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య సింపుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 23 బంతుల్లోనే 47 పరుగులు బాదేసిన ప్రియాంశ్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో సింపుల్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి మ్యాచులోనే మెరుపు ఇన్నింగ్స్ ఆడిన ప్రియాంశ్ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ప్రస్తుతం క్రీజులో శ్రేయస్ అయ్యర్ (24*) అజ్మతుల్లా ఒమర్జాయ్ (6*) ఉండగా పంజాబ్ స్కోరు 7.3 ఓవర్లకు 90/2 గా ఉంది.