ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ధోనీకి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ధోనీ కేవలం 11 బంతుల్లో 26* పరుగులు చేశారు. 43 సంవత్సరాల 280 రోజుల వయసులో ధోనీ ఈ అవార్డు అందుకున్నారు. అతి ఎక్కువ వయసులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న బ్యాటర్‌గాధోనీ రికార్డు సృష్టించారు.