రాజస్థాన్ రాష్ట్రంలోని కోటాలో మరో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇటీవల నీట్ శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే ఒడిశాకు చెందిన మరో విద్యార్థి ఫ్యాన్‌కు ఊరివేసుకని ఆత్యహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.