మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ ప్రముఖ దివంగత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరును ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారతీయ సినిమాకు ఏఎన్నార్ చేసిన కృషిని ఆయన ప్రశంసించారు. ఈ విషయమై నటుడు నాగార్జున ఎక్స్ వేదికగా స్పందించారు. 'ఐకానిక్ లెజెండ్స్ సరసన ఏఎన్నార్ గారిని ఆయన శత జయంతి సందర్భంగా గౌరవించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. ANR దూరదృష్టి, భారతీయ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతారలకు స్పూర్తినిస్తూనే ఉంటాయని' నాగార్జున రాసుకొచ్చారు.