ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. అయితే గవర్నర్ ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ సభ్యులు అడ్డు తగిలారు. అసెంబ్లీలో తమ పార్టీని ప్రతిపక్షంగా గుర్తించాలని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. పోడియం వద్దకు వచ్చి నిరసన తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్యే గవర్నర్ ప్రసంగాన్ని కొనసాగించారు.