AP: ఏప్రిల్ మూడో తేదీన సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అమరావతి సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రతిపాదించే అంశాలను మార్చి 27వ తేదీలోగా పంపాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, రాబోయే ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చ జరగనుంది. కొత్త పథకాల అమలు విధానాలపై అధికారులు ప్రాధాన్యతనివ్వనున్నారు.