ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ఈనెల 10న జరుగనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగనున్న ఈ సమావేశానికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, చీఫ్ సెక్రటరీ, ఉన్నతశాఖాధికారులు పాల్గొననున్నారు. నూతన మద్యం పాలసీ, మూడు సిలిండర్ల పంపిణీ, పీ-4 కార్యక్రమం అమలు, చెత్త పన్ను రద్దు, జల్‌జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు, పోలవరం నిర్మాణంపై కీలక చర్చ జరిగే అవకాశముంది.