AP: ఈ రెండు చోట్ల నుంచే తొలి ఫలితం

58చూసినవారు
AP: ఈ రెండు చోట్ల నుంచే తొలి ఫలితం
ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. కొవ్వూరు, నరసాపురం శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఫలితాలు మొట్టమొదట విడుదల కానున్నాయి. ఈ రెండు స్థానాల్లో 13 రౌండ్లలోనే ఫలితం తేలిపోనుంది. లెక్కింపు ప్రారంభమైన తర్వాత ఐదు గంటల్లోగా ఈ నియోజకవర్గాల పూర్తి ఫలితాలు వెల్లడి కానున్నాయి. భీమిలి, పాణ్యం నియోజకవర్గాల ఫలితాలు అన్నింటి కంటే ఆలస్యంగా రానున్నాయి.

సంబంధిత పోస్ట్