లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు

76చూసినవారు
లొంగిపోయిన ఐదుగురు మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో ఐదుగురు మావోయిస్టులు సోమవారం లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. ఐదుగురిలో మడ్కం పాండు, ఆయన భార్య రవ్వ భీమే, మడ్కం మాసా, కొమ్రం దులా, ముక సోధి ఉన్నారని సుక్మా పోలీసు సూపరింటెండెంట్ కిరణ్ చవాన్ తెలిపారు. మడ్కం పాండుపై రూ.8 లక్షల రివార్డు, ఆయన భార్య రవ్వ భీమేపై రూ.లక్ష రివార్డు ఉన్నట్లు చెప్పారు. వారంతా లొంగిపోవడాన్ని ఆయన అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్