ఫిబ్రవరి 23న ఏపీ గ్రూపు-2 మెయిన్స్‌ పరీక్ష: సీఎస్‌ విజయానంద్‌

57చూసినవారు
ఫిబ్రవరి 23న ఏపీ గ్రూపు-2 మెయిన్స్‌ పరీక్ష: సీఎస్‌ విజయానంద్‌
ఏపీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్‌ విజయానంద్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. 'ఫిబ్రవరి 23న 175 కేంద్రాల్లో గ్రూపు-2 మెయిన్స్‌ పరీక్ష జరుగనుంది. ఇందుకోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మొత్తం 92,250 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఉ.10 గంటల నుంచి మ.12.30 గంటల వరకు పేపర్‌-1 పరీక్ష, మ.3 నుంచి సా.5.30 గంటల వరకు పేపర్‌-2 పరీక్ష ఉంటుంది. పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది.' అని సీఎస్‌ తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్