ఉత్తరాఖండ్‌లో ప్రతికూల వాతావరణం కారణంగా చార్‌ధామ్ యాత్రను వాయిదా వేయాలని IMD విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వాతావరణ కేంద్రం (IMD) ఈ విషయాన్ని చెప్పింది. రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ చోట్ల కొండచరియలు విరిగిపడడంతోపాటు పలు ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో భక్తులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది.