ఒలింపిక్స్ జిమ్నాస్టిక్స్ లో 4 సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేసినందుకు ఓ అథ్లెట్ కాంస్యం కోల్పోయారు. AUG 5న పోటీలో USకు చెందిన జోర్డాన్ 13.666 స్కోరుతో ఐదోస్థానంలో నిలిచారు. పాయింట్లు తప్పుగా వేశారంటూ ఆమె రివ్యూకు వెళ్లడంతో బ్రాంజ్ దక్కింది. అయితే ఆమె నిర్దేశిత టైం కంటే 4 సెకన్లు ఆలస్యంగా అప్పీల్ చేశారంటూ రొమేనియా బృందం CASను ఆశ్రయించింది. నిజమని తేలడంతో కాంస్యం తిరిగిచ్చేయాలని కోర్టు ఆదేశించింది.