కొత్త రేషన్ కార్డుల జారీకి రంగం సిద్ధమైంది. ఈనెల 26వ తేదీ నుంచి రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం ఈ నెల 15 నుంచి దరఖాస్తులు స్వీకరించే ఛాన్సుంది. ఒకట్రెండు రోజుల్లో విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించనుంది. అర్హతల్లో ఎలాంటి మార్పులు చేయకుండా, గత విధానాలనే యథాతథంగా కొనసాగిస్తారని సమాచారం. గ్రామసభలు, బస్తీ సభల్లో దరఖాస్తులు స్వీకరించి, ఆన్లైన్‌లో నమోదు చేస్తారు. ఇప్పటికే వచ్చిన 12 లక్షల దరఖాస్తులను ఆమోదించే అవకాశం ఉంది.