బెండకాయలో విటమిన్లు సి, కె, మెగ్నిషియం, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. దీన్ని తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని వైద్య నిపుణులు తేల్చారు. అందువల్ల షుగర్ ఉన్నవారికి బెండకాయలు వరమనే చెప్పవచ్చు. 100 గ్రాముల బెండకాయల ద్వారా సుమారుగా 33 క్యాలరీల శక్తి లభిస్తుంది. బెండకాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయకుండా చేస్తుంది.