మహిళ కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్లు

58చూసినవారు
మహిళ కడుపులో కత్తెర వదిలేసిన డాక్టర్లు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ ఫిబ్రవరి 20, 2022న క్యాన్సర్ చికిత్స కోసం గ్వాలియర్‌లోని కమలా హాస్పిటల్‌లో కడుపు క్యాన్సర్‌కు చికిత్స చేయించుకుంది. మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు.. ఆమె కడుపులో కత్తెరను వదిలేశారు. రెండేళ్ల తర్వాత మహిళ కడుపునొప్పితో బాధపడుతూ అదే ఆస్పత్రికి వెళ్లగా సిటీ స్కాన్ చేసిన వైద్యులు కత్తెరను గుర్తించి తొలగించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత పోస్ట్