ఇటీవల కాలంలో చాలామంది హోం లోన్ సాయంతో సొంతింటి కల నెరవేర్చుకుంటున్నారు. అయితే హోం లోన్ తీసుకొనే ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఇన్సూరెన్స్ తీసుకోవాలి. పాలసీ తీసుకుంటే లోన్ మొత్తానికి సెక్యూరిటీ ఉంటుంది. ఇంటి రుణాన్ని నెలనెలా తిరిగి చెల్లించే ప్రక్రియలో రుణగ్రహీత అకస్మాత్తుగా మరణిస్తే ఆ రుణభారం కుటుంబసభ్యులపై పడకుండా బీమా సంస్థలు మిగిలిన రుణం మొత్తాన్ని బ్యాంకులకు కట్టేలా ఈ పాలసీ కాపాడుతుంది.