నేతల అరెస్టులు.. రేవంత్‌ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం: హరీశ్‌రావు

81చూసినవారు
నేతల అరెస్టులు.. రేవంత్‌ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దం: హరీశ్‌రావు
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అరెస్టులు, నిర్బంధాలు చేయడాన్ని ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్ళనివ్వకుండా ఈ నిర్బంధాలు ఎందుకని సీఎం రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఇది రేవంత్ నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమని ఆగ్రహం వ్యక్తంచేశారు. అదుపులోకి తీసుకున్న తమ పార్టీ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్