ఈ-స్కూటర్ అప్‌డేట్ అడిగింది.. ఆఫీస్‌కు లేట్ అయింది

84చూసినవారు
నోయిడాలో ప్రతీక్ రాయ్ అనే వ్యక్తికి ఎలక్ట్రిక్ స్కూటర్ వల్ల వింత అనుభవం ఎదురైంది. ఆఫీస్‌కు వెళ్దామని అతను ఎథర్ ఈ-స్కూటర్ ను స్టార్ట్ చేశాడు. కానీ ఆ బండి ఆన్ కాగానే సాఫ్ట్ వేర్ అప్‌డేట్ అడిగింది. దీంతో అతను ఆ అప్డేట్ పూర్తయ్యే వరకు ఆగాల్సి వచ్చింది. ఈ కారణంగా అతను ఆఫీస్‌కు వెళ్ళడం ఆలస్యమైంది. ఈ వింత అనుభవాన్ని అతను సోషల్ మీడియాలో పంచుకోగా.. 'ఇలా కూడా ఆఫీసుకు లేట్ అవుతారా?' అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్