NICL అసిస్టెంట్స్ (క్లాస్ III) పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 500 పోస్టులను భర్తీ చేయనుండగా, అందులో ఎస్సీ-43, ఎస్టీ-33, ఓబీసీ-113, ఈడబ్ల్యూఎస్-41, జనరల్-270 పోస్టులున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 21 పోస్టులు, తెలంగాణలో 12 పోస్టులు భర్తీ చేయనున్నారు. దరఖాస్తు దాఖలు చేసేందుకు ఆఖరు తేదీ నవంబర్ 11గా నిర్ణయించారు. వివరాలకు https://ibpsonline.ibps.in/niclaoct24/ ను చూడొచ్చు.