9 రోజుల మిషన్‌లో భాగంగా.. స్పేస్ టూర్‌కు వెళ్లిన భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్, 94 రోజులు గడిచినా ఇంకా భూమికి తిరిగి రాలేదు. జూన్ 5న అమెరికన్ ఆస్ట్రోనాట్ బ్యారీ విల్ మోరీతో కలిసి బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన సునీతా విలియమ్స్, నిజానికి జూన్ 14నే భూమ్మీదకి తిరిగి రావాల్సి ఉంది. వారు వెళ్లిన స్టార్ లైనర్స్‌లో సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరు అక్కడే చిక్కుకుపోయారు.