దానిమ్మ ఆకుల రసం తీసుకోవడం వల్ల చర్మ రోగాలను నివారించవచ్చు. అంతేకాకుండా చెవి సమస్యలతో బాధపడే వారు అంటే ఇన్ఫెక్షన్, నొప్పి వంటి సమస్యలు ఉన్న వారికి దానిమ్మ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాదు కుష్టు వ్యాధి ఉన్న వారికి కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు దీని కషాయం వర్షకాలంలో రోజుకు రెండు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.