దారుణం.. మహిళ స్వీపర్‌పై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచార యత్నం!

74చూసినవారు
దారుణం.. మహిళ స్వీపర్‌పై ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచార యత్నం!
TG: జయశంకర్ భూపాలపల్లిలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా ఎస్పీ డీ.పి.ఓ కార్యాలయంలో ఓ మహిళ స్వీపర్‌పై శనివారం ఉదయం ఏఆర్ కానిస్టేబుల్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ మహిళ గట్టిగా అరవడంతో అక్కడి నుంచి కానిస్టేబుల్ పారిపోయాడు. ఇక ఈ విషయం బయటికి వస్తే పరువు పోతుందని ఓ అధికారి స్కెచ్‌ వేశారట. ఇది ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసు అధికారులు అంతర్గత విచారణ చేపట్టారట. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్