సాధారణంగా ఎక్కువమంది కళ్లు గోధుమ రంగు లేదా నల్ల రంగులో ఉంటాయి. కానీ, ఇండోనేషియాలోని ఆగ్నేయ సులవేసి ప్రాంతంలో నివసించే బుటన్ తెగకు చెందిన ప్రజల కళ్లు మాత్రం నీలి రంగులోనే ఉంటాయట. దీనికి ప్రధాన కారణం వార్డెన్ బర్గ్ సిండ్రోమ్ అనే అరుదైన జన్యులోపం అని చెబుతున్నారు. ఇది ఒక వ్యాధి అని అందువల్లే కళ్లు రంగు మారిపోయి.. పిండం అభివృద్ధి దశ నుంచే నీలి రంగులోకి మారుతాయని వైద్యులు చెబుతున్నారు.