కర్ణాటక RTC కీలక నిర్ణయం తీసుకుంది. RTC బస్సుల్లో పురుషులకూ సీట్లు రిజర్వు చేయాలని నిర్ణయించింది. మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి ఉద్దేశించిన ‘శక్తి’ పథకం అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో సీట్లన్నీ వారే ఆక్రమిస్తున్నారని పలువురు పురుషులు అధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన అధికారులు.. దశల వారీగా పురుషులకూ సీట్లు కేటాయిస్తూ చర్యలు తీసుకుంటున్నారు. ఇదే విధానాన్ని TGSRTCలోనూ అమలు చేయాలని తెలంగాణ వాసులు కోరుతున్నారు.