ప్రధాని మోదీతో ఢిల్లీ నూతన సీఎం రేఖా గుప్తా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆమె మర్యాదపూర్వకంగా ప్రధానిని కలిసి మాట్లాడారు. అనంతరం ప్రధాని మోదీ ఆమెకు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. అంతకుముందు రేఖా గుప్తా ఆమె చదువుకున్న ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్లి ప్రిన్సిపల్, విద్యార్థులను కలిసి ముచ్చటించారు.