దారుణం.. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి

567చూసినవారు
జనగామ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనగామలో ఓ మహిళ రోడ్డు దాటుతుండగా.. హైదరాబాద్‌కు వెళ్తున్న హన్మకొండ డిపో ఆర్టీసీ బస్సు సదరు మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సదరు మహిళకు తీవ్రగాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఆ మహిళను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే మృతిచెందింది. దీంతో ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్