మణిపూర్‌లో భూకంపం

64చూసినవారు
మణిపూర్‌లో భూకంపం
మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో బుధవారం భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. పర్వత ప్రాంతాలైన కాంగ్‌పోక్పి జిల్లాలో భూప్రకంపనలు సంభవించినట్లు మణిపూర్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అధికారులు తెలిపారు. భూ కంపం భూఉపరితలం నుంచి 28 కిలోమీటర్ల లోతులో సంభవించిందని వెల్లడించారు. ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదన్నారు.

ట్యాగ్స్ :