దారుణం: మహిళను కాల్చి చంపిన దుండగులు

78చూసినవారు
తెలంగాణాలో దారుణం జరిగింది. గుర్తు తెలియని మహిళను దుండగులు కాల్చి చంపిన ఘటన వికారాబాద్ జిల్లా పెద్దెముల్ మండలంలో వెలుగుచూసింది. మారేపల్లి మార్గంలోని పెద్ద కాల్వలో పోలీసులు మృతదేహాన్ని గుర్తించారు. మహిళ ముఖంపై కాలిన గాయాలు ఉన్నాయని, అత్యాచారం చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనపై పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్